Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మళ్లీ రిజర్వేషన్ల లొల్లి.. పల్లెల్లో పంచాయతీ ఎన్నికలపై చర్చ

మళ్లీ రిజర్వేషన్ల లొల్లి.. పల్లెల్లో పంచాయతీ ఎన్నికలపై చర్చ

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
రాజకీయంగా కొన్నాళ్లుగా నిశ్శబ్దంగా ఉన్న పల్లెల్లో స్థానిక సంస్థల ఎన్నికలపై లొల్లి మళ్ళీ ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల మంత్రి మండలి సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నసురుల్లాబాద్ మండలం 19 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో పలు గ్రామాల్లో రిజర్వేషన్లు ప్రకటన వివాదానికి దారితీసింది. గ్రామంలో ఒక్క ఓటు లేకపోయినా రిజర్వేషన్ కేటాయించడంతో గ్రామస్తులు అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. పలు వార్డుల్లో కేటాయించిన రిజర్వేషన్ కు ఓటరు లేకపోయినా రిజర్వేషన్ కేటాయించడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. అలాగే బీసీ రిజర్వేషన్ పై హైకోర్టులో విచారణ ఉండగా రిజర్వేషన్లు పక్కటించడంతో సెప్టెంబర్లో నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడినాయి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందడంతో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేసింది.

దీంతో పల్లెల్లో పంచాయతీ పోరు సందడి మళ్లీ మొదలైంది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ముందుకెళ్లనున్నట్లు తెలిసింది. దీంతో పంచాయతీ రాజ్‌ శాఖ ఇందుకు సిద్ధమవుతోంది. ఇందులో  భాగంగా ఓటరు జాబితా సవరణకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ జారీ చేసింది. గురువారం నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. ఈ నెల 23వ తేదీన తుది ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాలను ఖరారు చేయనున్నారని తెలిసింది. ఇంతకుముందు ఎన్నికల సంఘం బీసీలకు 42 శాతం రిజర్షేన్లతో ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. దీనిపై హైకోర్టు స్టే ఇవ్వడంతో పాత రిజర్వేషన్ల ప్రకారం ముందుకెళ్లనుంది. అయితే మళ్లీ రిజర్వేషన్లు అనుకూలంగా వస్తాయో రావోనని ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. డిసెంబరు నెలలో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఆశావహుల్లో ఆశలు చిగురించడంతో పల్లెల్లో సందడి జోరందుకుంది. కొందరు ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు మొదలుపెట్టడంతో గ్రామాల్లో ఎన్నికల వేడి పెరిగింది. అయితే అధికారులు ఈ ఎన్నికలకు సంబంధించిన సన్నద్ధత కసరత్తు కొత్తగా ప్రారంభించారు. మద్దతు ఒడికట్టేందుకు  ఆశావహులు గత రెండు రోజులుగా చర్చలు, సమావేశాలు రహస్యంగా నిర్వహిస్తున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -