Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అవినీతిపై విచారణ జరపాలని వినతి..

అవినీతిపై విచారణ జరపాలని వినతి..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి పురపాలక సంఘం పరిధిలో  పండుగల ఖర్చులు  వివిధ ప్రజల సౌకర్యాల నిమిత్తం చేసే ఖర్చులను ఉదాహరణకు 10 లక్షలతో చేసిన పనులను ఇంతలు అనగా 40 లక్షల వరకు జనరల్ ఫండ్ నుండి ఖర్చు చేయడంలో అవినీతి జరుగుతుందని విచారణ జరపాలని కోరుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో  జిల్లా అదనపు  కలెక్టర్ భాస్కర్ రావు వినతిపత్రం అందజేశారు.

ప్రజలు చెల్లించే టాక్స్ రూపంలో వచ్చిన జనరల్  ఫండ్ ను ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ జీతాలకు మరియు  ప్రజలకు అత్యవసర ఇబ్బందులకు వినియోగించవలసిన ఫండ్ ను మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులపై ఒత్తిడి తెచ్చి ఇష్టారాజ్యంగా వినియోగించడం జరుగుతుందని,  గతంలో మున్సిపల్ డంపింగ్ యార్డు డిఆర్సిసి సెంటర్ల ను మహిళ సాధికారిక మరియు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయటంలో భాగంగా మహిళా సంఘాల వారిని గుర్తించి వారి ద్వారా డిఆర్సిసి కేంద్రం నిర్వహించడం జరిగేనీ, కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఈ సెంటర్లను నిర్వహిస్తున్నారని ఆరోపించారు. 

అర్బన్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద భువనగిరి పట్టణానికి 18 కోట్ల 70 లక్షల రూపాయలు మంజూరు కాగా,  వాటిని 35 వార్డుల అభివృద్ధి కోసం సమానంగా వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు కాజా అజీముద్దీన్, బిడ్డికాడి భగత్,  తాడూరి బిక్షపతి, నాయకులు కుశంగల రాజు, బర్రె రమేష్, తుమ్మల పాండు, బబ్లు, నువ్వుల సుధాకర్, నయిముద్దీన్, పెంట నితీష్, కంచనపల్లి నర్సింగరావు,రహీం, సుభాష్, అమీర్, బురాన్, వసీం, సత్యం లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -