Thursday, November 20, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం మురుగునీటి కాలువలను ఏర్పాటు చేయాలి..

జన్నారంలో సెంట్రల్ లైటింగ్ సిస్టం మురుగునీటి కాలువలను ఏర్పాటు చేయాలి..

- Advertisement -

ఎమ్మెల్యేను కలిసిన వినతి పత్రం అందించిన మున్నూరు కాపు సంఘం నాయకులు..
నవతెలంగాణ – జన్నారం

జన్నారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు రోడ్డుకిరువైపులా మురుగునీటి కాలువలను ఏర్పాటు చేయాలని జన్నారం మండల మున్నూరు కాపు సంఘ నాయకులు ఖానాపూర్ ఎమ్మెల్యే బెడమ బొజ్జు పటేల్ కు గురువారం వారి క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందించారు. అలాగే మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘ భవనానికి ప్రభుత్వ స్థలం కేటాయించాలని కోరారు.

 సందర్భంగా మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు కాసెట్టి లక్ష్మణ్ మాట్లాడుతూ, కాపు సంఘ నాయకులంతా ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలన్నారు. అనంతరం మండల తాసిల్దార్ రాజ మనోహర్ రెడ్డికి వినతి పత్రం అందించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు లెక్కల మల్లయ్య, నాసాని శ్రీనివాస్ కస్తూరి భూమన్న బొడ్డు రాజన్న భూతం శ్రీనివాస్, అప్పల జలపతి పూదరి నరసయ్య చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -