నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ప్రధాన కార్యాలయంలో 72 వ అఖిల భారత సహకార వారోత్సవముల ముగింపు వేడుకను బ్యాంకు అధ్యక్షులు కుంట రమేష్ రెడ్డి అధ్యక్షతన ఘనముగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుల వారు మాట్లాడుతూ.. సహకార ఉద్యమానికి పునాది వేసిన భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ని ప్రత్యేకంగా స్మరించారు. భారతదేశంలో సహకార భావనను బలపరచడంలో, గ్రామీణ అభివృద్ధి–రైతుల శ్రేయస్సు కోసం సహకారం అనే శక్తిని ప్రజల్లో స్థాపించడంలో నెహ్రూ పాత్ర అపారమని పేర్కొన్నారు. దేశ అభివృద్ధి సహకార వ్యవస్థ బలపడ్డప్పుడే సాధ్యమవుతుందని నెహ్రూ దృక్పథం నేటికీ ప్రస్తావనీయం, ఆచరణీయం అని,సహకార ఉద్యమం వల్లనే గ్రామీణ స్థాయిలో ఆర్థిక స్వావలంబన పెరిగి, మన బ్యాంకు కూడా అదే తత్వంతో ప్రజలకు సేవలందిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి ,లింగయ్య ,ఆనంద్ , ఉన్నతాధికారులు లింబాద్రి, శ్రీధర్ రెడ్డి, సుమమాల, సహాయ జనరల్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
సహకార వారోత్సవముల ముగింపు వేడుక
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



