- Advertisement -
- పార్థివ దేహాన్ని పరిశోధన కోసం హాస్పిటల్ కి అందించిన కుటుంబ సభ్యులు
- నవతెలంగాణ – రామన్నపేట
రామన్నపేట మండలంలోని శోభనాద్రి పురం గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధులు సీపీఐ(ఎం) నాయకురాలు, గ్రామ మొదటి సర్పంచి కొండకింది శ్రీనివాసరెడ్డి సతీమణి కొండకింది కమలమ్మ (90) హైదరాబాదులో మృతి చెందారు. శోభనాద్రిపురం గ్రామ శాఖ ఆధ్వర్యంలో పార్టీ పతాకాన్ని కప్పి ఆమె భౌతిక కాయంపై పార్టీ మండల కమిటీ సభ్యుడు ఎం.డి రషీద్, గ్రామ శాఖ కార్యదర్శి గోగు లింగస్వామి పార్టీ పతాకాన్ని కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నాటి నిజం నిరంకుశ అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1940 సంవత్సరంలోనే కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం తీసుకొని అనేక పోరాటాలకు సారధ్యం వహించారన్నారు.
శోభనాద్రిపురం గ్రామానికి మొదటిగా సర్పంచ్ బాధ్యతలు నిర్వహించిన కొండకింది శ్రీనివాసరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ తాను చేసే పోరాటాల్లో భాగస్వామ్యం అయిన కొండకింది కమలమ్మ త్యాగం మరువలేనిద ని అన్నారు. కడదాకా కమ్యూనిస్టుగా బ్రతికిన నిజాయితీగల నాయకురాలని వారు తెలిపారు. వారసులను కూడా వామపక్ష భావజాలం వైపు ఉండేలా చేశారన్నారు. కుటుంబ సభ్యులు కమలమ్మ పార్థివ దేహాన్ని కణనం చేయకుండా బాచుపల్లి మెడికల్ కళాశాల విద్యార్థుల పరిశోధనా నిమిత్తం వారి అప్పజెప్పి స్పూర్తిదాయకంగా నిలిచారన్నారు. నివాళులర్పించిన వారిలో పార్టీ గ్రామ సీనియర్ నాయకులు ఎండీ లతీఫ్, కొమ్ము అంజయ్య, నర్సింహా, ఎర్ర అంజయ్య, మారయ్య, ఇర్వి రవికుమార్, బీంపాక ప్రశాంత్, బోడిగే వెంకటేష్, బిక్షపతి తదితరులు ఉన్నారు.
- Advertisement -



