నవతెలంగాణ – కంఠేశ్వర్
నిజామాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోటరీ క్లబ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని క్లబ్ అధ్యక్షులు రొటేరియన్ పాకాల నరసింహారావు తెలిపారు. రక్తదానం మహాదానమని ఎందరో వ్యక్తులకు పునర్జన్మ ప్రసాదిస్తుందని రక్త దానం చేయడం ఒక గొప్ప మహాదానమని దీనివల్ల మరొకరికి ప్రాణదానం చేయడం జరుగుతుందని రక్త దానం చేయడం వల్ల రక్తం దానం చేసే వ్యక్తికి ఎటువంటి నష్టం ఉండదని ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి తప్పకుండా రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదానం చేయవచ్చని తెలియజేస్తూ ఒక్క యూనిట్ రక్తదానం చేయడం వల్ల ఒక కుటుంబాన్ని కాపాడగలదు రక్తదానం మనుషుల మధ్య ప్రేమను సేవాభావాన్ని పెంచుతుంది అని తెలియజేశారు ఈ కార్యక్రమానికి క్లబ్ సభ్యులతో పాటు ఇతరులు కూడా రక్తదానం చేయడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు రొటేరియన్ సంపత్, రొటేరియన్ గౌరీ శంకర్, రొటేరియన్ రాంప్రసాద్, రొటేరియన్ రాజశేఖర్, రొటేరియన్ వాసు తదితరులు పాల్గొన్నారు.
రోటరీ క్లబ్ ఆఫ్ జేమ్స్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


