– కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
– ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలన
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉన్న ధాన్యం బస్తాలను గమనించి, రైస్ మిల్లులకు వెంటదివెంట తరలించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని, తేమ శాతానికి లోబడిన ధాన్యాన్ని రైతులు కేంద్రానికి తెచ్చిన వెంటనే తూకం వేయించి లారీలలో లోడ్ చేసి మిల్లలకు పంపాలన్నారు. మిల్లుల వద్ద సకాలంలో ధాన్యం అన్ లోడ్ జరిగేలా పర్యవేక్షణ జరపాలని, ట్రక్ షీట్లను ఎప్పటికప్పుడు తెప్పించుకుని ఓపీఎంఎస్ లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. బిల్లుల చెల్లింపుల విషయంలో జాప్యానికి తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



