నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించే 108 అంబులెన్స్ ను అధికారులు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 108 అంబులెన్స్ ను, రికార్డులను ఉమ్మడి నిజమాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ రామలింగేశ్వర రెడ్డి తనిఖీ చేశారు.వాహనంలో ఉన్న మందులు, వైద్య పరికరాలు, ప్రస్తుతం వాటి పరిస్థితిని 108 సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. నిల్వలను చూసి రికార్డులు పరిశీలించారు.అనంతరం ప్రోగ్రాం మేనేజర్ రామలింగేశ్వర రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర సేవలు అందించేందుకు సిబ్బంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు.గర్భిణులను ప్రసవ సమయంలో ఆసుపత్రికి అంబులెన్స్ లోనే తరలించేలా క్షేత్ర స్థాయి వైద్య సిబ్బందితో కలిసి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నాణ్యమైన వైద్య సేవలు అందించి ప్రజల మన్నాలు పొందాలని సిబ్బందికి సూచించారు. రికార్డులు పరిశీలించి సిబ్బంది పనితీరును అభినందించారు. కార్యక్రమంలో సిబ్బంది ఈఎంటి విజయ్ కుమార్, పైలట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
108 అంబులెన్స్ తనిఖీ చేసిన జిల్లా ప్రోగ్రాం మేనేజర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

