నవతెలంగాణ – డిచ్ పల్లి
డ్వాక్రా గ్రూపులకు అందజేసే బ్యాంకు లింకేజ్ లోనై గురువారం ఇందల్ వాయి మండల కేంద్రంలోని ఐకెపి కార్యక్రమంలో సిసి లు, విఒఎ లతో బ్యాంకు అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజినల్ హెడ్ శ్రీలత, రీజినల్ అగ్రికల్చర్ అధికారి భైరవ్ నాథ్ జాదవ్, ఇందల్ వాయి బ్యాంకు మేనేజర్ విక్రం ముత, ఆర్డీఓ రాజేందర్ మెంటే,ఎపిఎం రాపోలు సునీత మాట్లాడుతూ.. యూనియన్ బ్యాంక్ ద్వారా మండలం లోని ఆయా గ్రామాలకు చెందిన డ్వాక్రా గ్రూపులకు అందజేయల్సిన రూణలను అందజేసి బ్యాంకుకు ఉన్న టార్గెట్ ను పూర్తి చేయవల్సిన బాధ్యత విఒఎ,సి సి లోనై ఉందన్నారు.
బ్యాంకులు రూణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయని, ఇప్పటి వరకు రూణలను క్రమం తప్పకుండా తిసుకుని చేల్లించిన గ్రూపులకు ఎక్కువ సంఖ్యలో రూణలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. త్వరలో జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమం లో జంబో చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తామని, మంచి పనితీరు కనబర్చిన వారికి మేమోంటు లను బహుకరిస్తామని ఇచ్చిన టార్గెట్ ను వచ్చే సోమవారం నాటికి పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఈ సమావేశంలో సి సి లు ఉదయ్ కుమార్, స్వప్నా రుణేంద్ర, కంప్యూటర్ ఆపరేటర్ రాజు తోపాటు తదితరులు పాల్గొన్నారు.



