ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ భారతీయ చిత్రాలలో ‘హరి హర వీరమల్లు’ ఒకటి. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, రెండు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలోని మూడవ పాటని, ట్రైలర్‌తో పాటు ఆవిష్కరించడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది.
షూటింగ్ కార్యక్రమాలు తుదిదశకు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జోరుగా జరుగు తున్నాయి. వీఎఫ్‌ఎక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్ పనులతో శరవేగంగా తుది మెరుగులు దిద్దుకుంటోంది. దర్శకుడు ఎ.ఎం.జ్యోతి కష్ణ ప్రతి విభాగాన్ని పర్యవేక్షిస్తూ, వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ఈ సినిమాతో ప్రేక్షకులకు అందించడానికి కషి చేస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మాట వినాలి’, ‘కొల్లగొట్టినాదిరో’ గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. చారిత్రాత్మక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు. మొఘల్ చక్రవర్తిగా బాబీ డియోల్ నటిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జిషు సేన్‌గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నిర్మాత ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో భారీ ఎత్తున విడుదల కానున్న ‘హరి హర వీరమల్లు’ సినిమా.. ప్రేక్షకుల హదయాలను, బాక్సాఫీస్‌ను గెలుచుకోవడానికి సిద్ధంగా ఉంది.
జూన్ 12న ‘హరి హర వీరమల్లు’ రిలీజ్
- Advertisement -
- Advertisement -