విజువల్‌ వండర్‌గా కన్నప్ప

విజువల్‌ వండర్‌గా కన్నప్పహీరో విష్ణు నటిస్తూ, నిర్మిస్తున్న ‘కన్నప్ప’లో మోహన్‌బాబు, మోహన్‌ లాల్‌, శరత్‌కుమార్‌, ప్రభాస్‌, బ్రహ్మానందం వంటి దిగ్గజ నటీనటులు నటిస్తున్నారు. రీసెంట్‌గా బాలీవుడ్‌ హీరో అక్షరు కుమార్‌ కూడా చిత్రీకరణలో జాయిన్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అక్షరు కుమార్‌ తన సీన్లకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేశారు. ఈ మేరకు అక్షరు కుమార్‌తో పని చేసిన ఎక్స్‌పీరియెన్స్‌ గురించి విష్ణు మంచు తన సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.’అక్షరుకుమార్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. ఈ ప్రయాణం ఎంతో విలువైంది. ఇంకా ఇలా ఎన్నో సార్లు కలవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ”కన్నప్ప” సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చే విజువల్‌ వండర్‌గా రాబోతోంది. ధైర్యవంతుడైన యోధుడు శివుని భక్తుడైన కన్నప్ప కథను అద్భుతంగా మల్చుతున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది. మోహన్‌ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ డైరెక్ట్‌ చేస్తున్నారు.

Spread the love