Saturday, September 19, 2026
E-PAPER
Homeతాజా వార్తలునా రూటే సపరేటు..

నా రూటే సపరేటు..

- Advertisement -

‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో పాన్-ఇండియా విజయం సాధించిన హీరో తేజ సజ్జ ప్రస్తుతం ‘జాంబీ రెడ్డి 2 నెక్ట్స్‌ లెవెల్‌’గా వస్తున్న ‘జోంబీ రెడ్డి’ సెకెండ్ పార్ట్ లో నటిస్తున్నారు. ‘జాంబీ రెడ్డి’ క్రియేటర్ ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్ గా, సుపర్ణ్ ఎస్ వర్మ దర్శకుడిగా చేస్తున్నారు. ‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ప్రశంసలు అందుకున్న ప్రాజెక్ట్స్‌తో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రచయితగా పనిచేసిన సుపర్ణ్ ఎస్. వర్మ.. ఈ ఫ్రాంచైజ్‌కు తనదైన ఇంటెన్స్ టచ్‌ను తీసుకొస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. గతంలో వీరి కాంబి నేషన్‌లో ‘మిరాయ్’ బ్లాక్ బస్టర్ అయ్యింది. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘జాంబీ రెడ్డి 2’ టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియోకు సెన్సేష నల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తుండగా.. షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు.

ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఉపేంద్రను ఇంతకుముందెన్నడూ చూడని వైల్డ్, ఫియర్స్, లార్జర్ దెన్ లైఫ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. భారీ చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ.. ఒక చేతిలో పొడవైన ఆయుధాన్ని పట్టుకుని కనిపించారు. రఫ్ లుక్, విరబోసుకున్న జుట్టు, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్‌ తో ఈ క్యారెక్టర్ ఎవరు? అనే ఆసక్తిని పెంచుతున్నారు. డార్క్ కాస్ట్యూమ్, ట్రైబల్ ఇన్‌స్పైర్డ్ ప్యాటర్న్స్ ఈ క్యారెక్టర్‌ రా అండ్ యూనిక్ లుక్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నాయి. దట్టమైన అడవి, వెలుగుతున్న కాగడాలు, మిస్టీరియస్ సిల్హౌట్స్‌తో పోస్టర్‌కు ఒక డిఫరెంట్ ఫాంటసీ-యాక్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇక పోస్టర్‌పై ఉన్న ‘రెడీ టు టర్న్‌ ది వరల్డ్‌ అప్‌సైడ్‌ డౌన్‌’ అనే ట్యాగ్‌లైన్.. ఉపేంద్ర పోజ్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, నేపాలీ, జపనీస్ భాషల్లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -