విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఏందయ్యా సామీ..’ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 21న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాటను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. విజయ్, రశ్మిక పెళ్లి సందర్భంగా రిలీజ్ చేసిన ‘ఏందయ్యా సామీ..’ సాంగ్ ప్రోమో హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడీ ఫుల్ వెర్షన్ సాంగ్ కోసం ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న వివాహం తర్వాత కలిసి నటిస్తున్న సినిమాగా అటు వారి ఫ్యాన్స్ లోనూ, ఇటు మూవీ లవర్స్ లోనూ ఈ సినిమా ఆసక్తి కలిగిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్ మూవీపై అంచనాలు మరింతగా పెంచేసింది అని చిత్ర యూనిట్ తెలిపింది.
‘రణబాలి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



