Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలువల్లెంకుంట మానేరులో యధేచ్చగా ఇసుక దందా.

వల్లెంకుంట మానేరులో యధేచ్చగా ఇసుక దందా.

- Advertisement -

రూ.100 చెల్లిస్తే ట్రాక్టర్ లోడ్
నకిలీ రసీదులతో సరికొత్త దందాకు తెరలేపిన అక్రమార్కులు
చోద్యం చూస్తున్న పోలీస్,మైనింగ్ అధికారులు


నవతెలంగాణ – మల్హర్ రావు.

మండలంలోని వల్లెంకుంట,మల్లారం,తాడిచెర్ల తదితర గ్రామాల్లోని మానేరు పరివాహక ప్రాంతాల్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొన్ని నెలలుగా యథేచ్ఛగా ఇసుక దందా జోరుగా సాగుతున్నాయి. అధికారుల కళ్లుగప్పి ట్రాక్టర్ యజమానులు, అక్రమ ఇసుక వ్యాపారులు దందాను మూడు పువ్వులుగా,ఆరు కాయలుగా యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.ట్రాక్టర్లలో ఇసుకను కూలీలతో కాకుండా నేరుగా ట్రాక్టర్ డ్రోజర్లతో అడ్డుఅడుపు లేకుండా ఓసిపి గోతులను తలపించేలా భారీగా తవ్వకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన పిడి,ఏపిడీ అధికారులచే అనుమతులతో డీడీలు లేకుండా ఉచితంగా అందించాలని ఆదేశించింది.ఇదే అదునుగా భావించిన ఇసుకాసురులు రాత్రి,పగలు అనే తేడాలేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్నారు.

నకిలీ రసీదులతో సరికొత్త దందా
వల్లెంకుంట మానేరులో ఇసుకను ఒక ట్రాక్టర్ లోడుకు రూ.100 చెల్లించి నకిలీ రసీదులతో సరికొత్త అక్రమ దందాకు తెరలేపారు. ఈ ఘటనపై పంచాయతీ కార్యదర్శి, జిపిఓ లను నవ తెలంగాణ వివరణ కోరగా నకిలీ రసీదులపై తమకు సంబంధం లేదని,అసలు తాము ఎలాంటి పరిమిషన్ ఇవ్వలేదని,ఇచ్చేస్థాయి మాది కాదని చెప్పారు.ఈ అక్రమ దందాపై ఉన్నతాధికారులు పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.ఈ అక్రమ ఇసుక దందాలో ఇసుక వ్యాపారులు,ట్రాక్టర్ యజమానులు,పాలకవర్గం సంయుక్తంగా నడిపిస్తోన్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై నాలుగైదు రోజులు క్రితం పంచాయతీ కార్యాలయంలో రహస్య చర్చ సాగినట్లుగా బహిరంగంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.ఈ అక్రమ దందా కొయ్యుర్ పోలీస్ స్టేషన్,పారెస్టు రేంజ్ కార్యాలయానికి ఆమడ దూరంలో వల్లెంకుంట మానేరు నుంచి ట్రాక్టర్ డోజర్ ద్వారా ఇసుకను తోడేస్తూ కాటారం, గంగారం,ఎడ్లపల్లి, గారెపల్లి ప్రాంతాలకు ఉదయం మొదలుకొని అర్ధరాత్రి వరకు ట్రాక్టర్ల ద్వారా తరలిస్తూ వేలు గడుస్తున్నా అధికారులు మాత్రం కళ్ళులేని కాబోదుల్లా చూస్తున్నారు.అక్రమ ఇసుకను ఆపాలని పలువురు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చిన ఇసుక వ్యాపారులు ఇచ్చే మామూళ్లకు తలొగ్గి పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు.తాడిచెర్ల మానేరు నుంచి పెద్దతూoడ్ల, ఖాసింపల్లి,జంగెడు,భూపాలపల్లికి అక్రమంగా తరలిస్తూ వేలు ఘడిస్తున్నారు. అక్రమ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయకపోతే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగు,సాగు నీటికి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం పొంచిఉందని రైతులు వాపోతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -