Friday, September 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలు‘పంచనామా’కి విశేష ఆదరణ

‘పంచనామా’కి విశేష ఆదరణ

- Advertisement -

జీ5 గత వారం ‘పంచనామా’ అన ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఈనెల 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతూ ఉంది. మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కి నిర్మాత, షో రన్నర్‌గా ఉదయభాను వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌‌తో వచ్చిన ఈ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఆరు ఎపిసోడ్స్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో ఆడియెన్స్‌ ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు. వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టి గేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని తెలుసుకోవడం.. వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ సిరీస్ ఎంతో ఉత్కంఠ భరితంగా మారింది. ఈ మొదటి సీజన్ క్లైమాక్స్ కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇక వెంటనే రెండో సీజన్ చూసేయాలన్నంత ఇంట్రెస్ట్ కలిగించేలా ఈ మొదటి సీజన్‌ను తెరకెక్కించారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్‌లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పంచనామా’ కచ్చితంగా నచ్చుతుంది. అందుకే జీ5లో కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది అని మేకర్స్‌ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -