Thursday, November 20, 2025
E-PAPER
Homeజిల్లాలుభారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు స్వాధీనం..

భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు స్వాధీనం..

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
నగరంలో భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు విక్రయిస్తున్న, వాటిని బైక్​లకు బిగిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సీపీ సాయిచైతన్య తెలిపారు. గురువారం నగరంలోని సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో రాయల్ ఎన్ఫిల్డ్ సైలెన్సర్లు  అమ్ముతూ.. బిగిస్తున్నట్లుగా పక్కా సమాచారం మేరకు నాలుగు చోట్ల దాడులు చేశామని పేర్కొన్నారు. అందులో లోహియా ఆటోమొబైల్స్, విజయలక్ష్మి ఆటోమొబైల్స్ సర్వీస్ సెంటర్, శివశంకర్ ఆటోమొబైల్స్, శ్రీ లక్ష్మీనరసింహ ఆటోమొబైల్స్ కన్సల్టెంట్లలో సోదాలు నిర్వహించామన్నారు.

నిషేధాజ్ఞలను ఉల్లంఘించి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా హానికర అధిక శబ్దాలు వచ్చే సైలెన్సర్లను అమ్ముతున్న శ్రీ లక్ష్మీనరసింహ ఆటోమొబైల్స్లో మొత్తం ఎనిమిది కొత్త సైలెన్సర్లను జప్తు చేసినట్లు చెప్పారు.శ్రీ లక్ష్మి నరసింహా ఆటోమొబైల్స్ యజమాని మునిశెట్టి రంజిత్ను అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. సెకండ్ హ్యాండ్ సైలెన్సర్లు అమ్ముతున్న విజయలక్ష్మి ఆటోమొబైల్స్ సర్వీస్ సెంటర్లలో మొత్తం 10 నిషేధిత సైలెన్సర్లు, అదేవిధంగా శివ శంకర్ ఆటోమొబైల్స్లో 11 సెకండ్ హ్యాండ్ నిషేధిత సైలెన్సర్లను జప్తు చేశామన్నారు. నిషేధిత సైలెన్సర్లను  అమ్మిన యజమానులపై, వాటిని బిగించిన మెకానిక్లపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీపీ సాయిచైతన్య చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -