తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామేల్
నవతెలంగాణ – నూతనకల్
మండల పరిధిలోని వెంకేపెళ్లిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తుంగతుర్తి శాసనసభ సభ్యులు మందుల సామెల్ గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని ఎవరు ఆందోళన చెందొద్దని అన్నారు. విడతల వారీగా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ధ్రువీకరణ పత్రాలు అందుకున్న ప్రతి ఒక్కరు ఇంటి నిర్మాణ పనులను వేగవంతం చేసి ప్రభుత్వం అందించే లబ్ధిని పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగం సుధాకర్ రెడ్డి ,కాంగ్రెస్ నాయకులు పాల్వాయి నాగరాజు సైరెడ్డి సుధీర్ రెడ్డి లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ధ్రువీకరణ పత్రాలు అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



