నవతెలంగాణ – నవీపేట్
మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం పాలకవర్గం మరోసారి గురువారం బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో కొన్ని సొసైటీ పాలకవర్గాలు అవకతవకాలకు పాల్పడ్డారనే నేపంతో సొసైటీ పాలకవర్గాలను రద్దు చేశారు. దీంతో బిఆర్ఎస్ అనుకూల పాలకవర్గాలను రద్దు చేశారంటూ తమ వల్ల ఎటువంటి అవకతవకలు జరగలేదని హైకోర్టును ఆశ్రయించడంతో తిరిగి బాధ్యతలను ఈనెల 17 వరకు అప్పగించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో డిసీఓ శ్రీనివాస్ బుధవారం తిరిగి బాధ్యతలు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా కార్యదర్శి మహేష్ పాలకవర్గానికి గురువారం బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ న్యాలకంటి అబ్బన్న మాట్లాడుతూ సెప్టెంబర్ 22 న హైకోర్టు తిరిగి పాలకవర్గానికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించినప్పటికీ ఎన్నికల కోడ్ తదితర కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చిందని అన్నారు. రాజకీయ కోణంతో కొన్ని సొసైటీ పాలక వర్గాలను రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదని అన్నారు. గతంలో లాగే రైతుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
తిరిగి బాధ్యతలు చేపట్టిన నవీపేట్ సొసైటీ పాలకవర్గం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



