Thursday, November 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాల నిరోధక అవగాహన..

మాదకద్రవ్యాల నిరోధక అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ – చిన్నకోడూరు
మాదకద్రవ్యాలపై చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్  కళాశాలలో అవగాహన సదస్సులు గురువారంనిర్వహించినట్లు ఎస్ఐ వెంకట్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం వల్ల యువత చెడు త్రోవ పడకుండా వాటి వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది . మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి యువత వారి భవిష్యత్తును  నాశనం చేసుకుంటున్నారని సూచించారు.

విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని విద్యార్థి జీవితంలో క్రమశిక్షణతో కూడిన విద్య అత్యంత ముఖ్యమని, మైనర్లు వాహనాలు నడపరాదని విద్యార్థులకుతగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్, కౌన్సిలర్  వెంకటకృష్ణ,అధ్యాపకులు ప్రసాద్, నాగేందర్, రవి,కృష్ణ, అనిల్,సాయి కుమార్, స్వామి,సునీత గార్లు మరియు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -