ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి రాములు
నవతెలంగాణ – పాలకుర్తి
ముదిరాజులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి ముదిరాజుల సంక్షేమానికి పాటుపడాలని ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి చిక్కుడు రాములు ప్రభుత్వాన్ని కోరారు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండ ప్రకాష్ ఆదేశాల మేరకు నవంబర్ 21న జరిగే ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కోరుతూ గురువారం మండల కేంద్రంలో గల రాజీవ్ గాంధీ చౌరస్తాలో వాల్ పస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చిక్కుడు రాములు మాట్లాడుతూ.. 11వ ముదిరాజ్ మహాసభ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పల్లె పల్లెనా ముదిరాజ్ జెండా, ముదిరాజ్ ఆత్మగరవ ఎజెండా నినాదంతో గ్రామాల్లో ముదిరాజ్ మహాసభ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు మాచర్ల ఎల్లయ్య, ముదిరాజ్ మహాసభ మండల కార్యదర్శి మామిండ్ల లక్ష్మణ్,ఉపాధ్యక్షుడు నీరటి చంద్రయ్య, వల్మిడి మాజీ ఉపసర్పంచ్ సోమయ్య, ముదిరాజ్ మహాసభ దళితేపల్లి సొసైటీ అధ్యక్షులు మోకాటి యాదగిరి, ముదిరాజ్ మహాసభ యూత్ నాయకులు బాల బోయిన నరేష్, నాయకులు గోరంతల ఎల్లస్వామి, పంగ సైదులు, మామిండ్ల వెంకన్న, తరాల గోపాల్, మామిండ్ల ప్రవీణ్, దేశబోయిన ప్రశాంత్, దేశబోయిన యాకన్న, రేగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



