- Advertisement -
నవతెలంగాణ – మిర్యాలగూడ
ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని గ్రంధాలయ రీడర్స్ కు రాజ్యాంగం- ఎదుర్కొంటున్న సవాళ్లు, అనే అంశంపై గురువారం సామాజికవేత్త డాక్టర్ రాజు ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఇటీవల డాక్టర్ మువ్వా రామారావు ఆధ్వర్యంలో జనవిజ్ఞాన వేదిక నిర్వహించిన నెహ్రూ ఆలోచన విధానం శాస్త్రీయ దృక్పథం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని అందులో గెలుపొందిన వారికి, రాజ్యాంగం ఎదుర్కొంటున్న సవాళ్లు అనే వ్యాసరచనలో గెలుపొందిన వారికి ఈ నెల 26వ తేదీన బహుమతుల ప్రధానం కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట కందుకూరి సుదర్శన్, సుధాకర్ తదితరులు ఉన్నారు తెలిపారు.
- Advertisement -



