ఆలయ ఈవో లక్ష్మీప్రసన్న
నవతెలంగాణ-పాలకుర్తి
శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి టెండర్ ఆదాయం 1.80 లక్షలు వచ్చాయని ఆలయ ఈవో భాగం లక్ష్మీప్రసన్న తెలిపారు. గురువారం ఈవో లక్ష్మీ ప్రసన్న మాట్లాడుతూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి వేలంపాట కాలపరిమితిలో కార్తీక మాసం రానందున కొబ్బరికాయలు, పూజా సామాగ్రి, (అభిషేకం వాహన పూజా సామాగ్రి మినహాయించి) టెండర్ షెడ్యూలు ఎవరు కొనుగోలు చేయకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత కాల పరిమితి ముగిసిన టెండర్దారునికి 42 రోజులు టెండర్ కల పరిమితిని పెంచడం ద్వారా ఆలయానికి ఆదాయం వచ్చిందని తెలిపారు. కొబ్బరి కాయలు, పూజా సామగ్రి (అభిషేకం, వాహన పూజ సామగ్రిమినహాయించి), తల నీలాలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్ కోసం సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం పాట దారులు షెడ్యూలు కొనుగోలు చేయకపోవడంతో వాయిదా వేసినట్లు ఆలయ ఈఓ లక్ష్మీప్రసన్న తెలిపారు. తిరిగి వేలంపాట నిర్వహించే తేదీని త్వరలో ప్రకటించనున్నట్లు ఈఓ తెలిపారు.
ఆలయ టెండర్ ఆదాయం 1.80 లక్షలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



