హీరో అల్లరి నరేష్ నటించిన థ్రిల్లర్ ’12ఎ రైల్వే కాలనీ’. నూతన దర్శకుడు నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. పవన్ కుమార్ సమర్పణలో డాక్టర్ అనిల్ విశ్వనాథ్ షోరన్నర్‌గా పనిచేస్తున్నారు. ఆయన ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశారు. కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. నేడు (శుక్రవారం) ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్ గురువారం మీడియాతో మాట్లాడుతూ, ‘ఇప్పటివరకూ నేను సస్పెన్స్ థ్రిల్లర్ చేయలేదు. ఇందులో పారానార్మల్ టింజ్ చాలా బాగుంటుంది. యదార్థంగా జరిగిన సంఘటన ఆధారంగా తీసిన సినిమా ఇది. అనిల్ కథ చెప్పినప్పుడు ఇంట్రవెల్‌లో షాక్ అయ్యాను.
సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో అనిపించింది. ‘మహారాజా’ సినిమా తీసుకుంటే అందులో స్క్రీన్ ప్లే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎక్కడో మొదలైన సీన్‌కి చివర్లో కనెక్షన్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో ఒక మూడు నాలుగు కథలు సమాంతరంగా జరుగుతుంటాయి. చాలా మైండ్ గేమ్ ఉంటుంది. ఇలాంటి స్క్రీన్ ప్లేతో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఈ సినిమా సక్సెస్ అయితే తప్పకుండా స్క్రీన్ ప్లే గురించి చర్చిస్తారు. ఈ సినిమాలో కార్తీక్ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తాను. లోకల్ ఎమెల్యే దగ్గర పని చేస్తుంటాను. అక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది. సరదాగా జరిగిపోతున్నప్పుడు ఒక సంఘటన ఎదురవుతుంది. ఆ సంఘటన తన జీవితంలో ఎలాంటి మలుపు తీసుకుంది అనేది మిగతా కథ. ఈ సినిమా చూసిన తర్వాత నా కెరీర్‌లో ఒక మంచి సినిమా అనే రెస్పాన్స్‌ని ఆడియన్స్ ఇస్తారనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
థ్రిల్ చేసే మైండ్ గేమ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



