Friday, November 21, 2025
E-PAPER
Homeజాతీయంప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కుతున్నారు

- Advertisement -

ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలిపై ప్రముఖుల విమర్శ
పలు ప్రజా సంఘాలు, వేదికల బహిరంగ ప్రకటన

న్యూఢిల్లీ : దేశ ప్రజాస్వామ్య చట్రంపై జరుగుతున్న వ్యవస్థాగత దాడికి భారత ఎన్నికల కమిషన్‌ బాధ్యురాలంటూ పలువురు ప్రముఖులు, పలు పౌర గ్రూపులు, ప్రజా సంఘాలు నేరుగా ఇసిని విమర్శించాయి. ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎన్నికల కమిషన్‌ ‘రహస్యంగా, వ్యవస్థాగత దాడికి పాల్పడుతోందని ప్రముఖులు, పౌర సంఘాలతో కూడిన వేదిక హెచ్చరించింది. దీనివల్ల రాజకీయ రంగంలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని, డజనుకు పైగా రాష్ట్రాల్లో భయాందోళనలు తలెత్తుతున్నాయని పేర్కొంది. ఈ మేరకు జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి, రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్‌, తుషార్‌ గాంధీ సహా పలువురు ప్రముఖులు, సంస్థల నుండి తీవ్రమైన పదజాలంతో కూడిన ఒక బహిరంగ ప్రకటన వెలువడింది. తొలుత బీహార్‌లో అమలు చేసిన ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)పై రేగిన దుమారం నేపథ్యంలో ఎన్నికల కమిషన్‌ వ్యవహార శైలిపై అనేక విమర్శలు తలెత్తాయి.

సర్‌ అనేది పాలనాపరమైన ప్రక్రియ కాదని,ప్రాధమికంగా ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు లక్షలాది మంది చట్టబద్ధమైన ఓటర్లకు ఓటు హక్కు లేకుండా చేసే సాధనమని పలువురు ప్రముఖులు విమర్శించారు. సర్‌కు 2003లో ప్రవేశపెట్టిన ఓటర్ల జాబితా సవరణ వ్యవస్థకు ఎలాంటి పోలిక లేదని టీఎన్‌ఐఈతో మాట్లాడుతూ రాజకీయ ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్‌ పేర్కొన్నారు.
‘ప్రత్యేకమైన ఉద్దేశం’తోనే, బహుశా పాలక పార్టీల అభ్యర్ధులకు లబ్ది చేకూర్చేలానే ఓటర్ల జాబితా లో మార్పులు, చేర్పులు, తొలగింపులు జరిగాయని దేశవ్యాప్తంగా గల ఎన్‌జీఓలు, ప్రముఖులు విడుదల చేసిన ఆ ప్రకటన పేర్కొంది. బీహార్‌ రాష్ట్ర స్థాయిలో తలెత్తిన ఇబ్బందులకు సంఘీభావం ప్రకటిస్తూ, ఈ ఎన్నికల ఫలితాలను తిరస్కరించడంలో బీహార్‌ ప్రజలకు బాసటగా వుంటామని ఆ ప్రకటనలో ఆ గ్రూపులు పేర్కొన్నాయి.ఈ ఏడాది ఆగస్టులో, బీహార్‌ సర్‌లోని అవకతవకల గురించి ఓట్‌ ఫర్‌ డెమోక్రసీ కూడా తన ప్రాధమిక విశ్లేషణను విడుదల చేసింది.

ఈసారి, ఈ గ్రూపులన్నీ కూడా ప్రతిపక్ష పార్టీల ను కూడా విమర్శించాయి. ఎస్‌ఐఆర్‌ ఫ్రేమ్‌వర్క్‌ను తీవ్రంగా నిరసిస్తున్నప్పటికీ దాని ప్రాతిపదికన నిర్వహించిన ఎన్నికల్లో పాల్గొన్నాయంటూ విమర్శలు చేశాయి. ఇలా చేయడం ద్వారా, ‘మోసపూరితంగా ఎన్నికైన ప్రభుత్వాని’కి ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ విశ్వసనీయతను కల్పించాయని ఆ ప్రకటన విమర్శి ంచింది. ఓటర్‌ అధికార్‌ యాత్ర వంటి ఉద్యమాల సమయంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించిన ప్పటికీ, అట్టడుగు స్థాయిలో పౌర సమాజ నెట్‌వర్క్‌్‌ల తో శాశ్వత పొత్తులను నిర్మించడంలో ప్రతిపక్షం విఫ లమైందని ఆ ప్రకటన పేర్కొంది. ఇటీవలి సంవత్స రాల్లో ఎన్నికల కమిషన్‌ పౌర సమాజం నుండి అత్య ంత తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోందని ఆ ప్రకటన లో ప్రజా సంస్థలు, సంఘాలు, ప్రముఖులు పేర్కొ న్నారు. ”ఎన్నికల కమిషన్‌ మొదటగా తన రాజ్యాంగ పరమైన ఆదేశాలను విస్మరించిందని, రెండవది ఎన్నికల సమగ్రతకు రక్షణ కల్పించే సంస్థగా కాకుం డా దాడి చేసే సంస్థగా మారిపోయిందని, ఇక మూడవది ప్రస్తుత నాయకత్వ పరిధిలో తన చట్ట బద్ధతను కోల్పోయిందని”ఆ ప్రకటన విమర్శించింది.

నిష్పక్షపాతంగా వ్యవహరించే పారదర్శక కమిషన్‌ కోసం పనిచేస్తామని ఆ సంయుక్త ప్రకటన పై సంతకాలు చేసిన వారు ప్రతిన చేశారు. అలాగే సంఘటిత ప్రచారం కూడా చేపడతామని పేర్కొ న్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను మరో 12 రాష్ట్రాల్లో ప్రారంభించడానికి రంగం సిద్ధమైందని సివిల్‌ సొసైటీ గ్రూపులు హెచ్చరించాయి. దీనివల్ల మరింత పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోతారని భయాందోళనలు వ్యక్తం చేశాయి. ‘సక్రమమైన ఓటరు ఎవరూ కూడా వెనకబడరాదు’ అన్న నినాదంతో వీరందరూ కలిసి చట్టబద్ధమైన, రాజకీయ, ప్రజా సమీకరణకు సన్నద్ధమవుతున్నారు.
ఈ ప్రకటనకు సమాజంలోని విస్తృత వర్గాల నుంచి మద్దతు లభించింది. రిటైరైన న్యాయమూర్తు లు, సీనియర్‌ ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్థికవేత్తలు, రైతు సంఘాలు, టీచర్ల గ్రూపులు, సాంకేతికవేత్తలు, జెస్యూట్‌ సంస్థలు, కళాకారులు, విద్యార్ధుల గ్రూపులు ఇలా అందరూ తమ మద్దతును తెలియచేశారు.

ఈ ప్రకటనపై సంతకాలు చేసిన ప్రముఖుల్లో జస్టిస్‌ బి.సుదర్శన్‌ రెడ్డి (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి), ఎం.జి.దేవసహాయం (రిటైర్డ్‌ ఐఎఎస్‌), డాక్టర్‌ పరకాల ప్రభాకర్‌ (రాజకీయ ఆర్థికవేత్త), సామాజిక కార్యకర్త తుషార్‌ గాంధీ, మీనా గుప్తా (రిటైర్డ్‌ ఐఎఎస్‌), థామస్‌ ఫ్రాంకో, ఓటర్స్‌ రైట్స్‌ మూవ్‌ మెంట్‌, జస్టిస్‌ శంకర్‌ కె.జి, మాజీ సంపాదకులు కె.రామచంద్ర మూర్తి వున్నారు. వీరందరూ కలిసి ముందుకు రావడం ఎస్‌ఐఆర్‌ విస్తరణను సవాలు చేసేందుకు దేశవ్యాప్తంగా పౌర సమాజ ఫ్రంట్‌ ఆవిర్భవిస్తోందని సంకేతాలు పంపుతోంది. రిటైరైన సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి దేవసహాయం టిఎన్‌ఐఇ తో మాట్లాడుతూ, ఈ బీహార్‌ ఎన్నికలు స్వేచ్ఛగా, సక్రమంగా జరిగాయని మనం ఎలా చెబుతాం” అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్‌ అనూహ్యమైన రీతిలో స్క్రూటినీని ఎదుర్కొనడం, ప్రతిపక్షాలు వారి వ్యూహానికి సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కొనడం, పౌర సమాజ గ్రూపులు సమన్వయంతో ఒత్తిడి తెస్తూ ప్రచారాలు సాగించాలనుకోవడంతో ఎన్నికల సమగ్రతపై భారతదేశం తీవ్రమైన ఘర్షణకు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. తీవ్రమైన హెచ్చరిక, ప్రతినతో ఆ ప్రకటన ముగిసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -