Friday, November 21, 2025
E-PAPER
Homeబీజినెస్ఐపీఓకు వాల్యూ 360 కమ్యూనికేషన్‌

ఐపీఓకు వాల్యూ 360 కమ్యూనికేషన్‌

- Advertisement -

ఎన్‌ఎస్‌ఈ సూత్రప్రాయ ఆమోదం
న్యూఢిల్లీ: వాల్యూ 360 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ ఈక్విటీ షేర్లను ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫారమ్‌పై లిస్టింగ్‌ చేయడానికి ఎస్‌ఎన్‌ఇ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని ఆ సంస్థ తెలిపింది. కంపెనీ డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేయగా ఎన్‌ఎస్‌ఈ సూత్రప్రాయంగా అనుమతించిందని వాల్యూ 360 కమ్యూనికేషన్‌ పేర్కొంది. తుది ఆమోదం అనేది కంపెనీ అందించే రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్టస్‌ (ఆర్‌హెచ్‌పీ)పై ఆధారపడి ఉంటుంది. ”మొత్తం నియంత్రణ ప్రక్రియలో ఇది ఒక విధానపరమైన అడుగు. వర్తించే మార్గదర్శకాలకు అనుగుణంగా అన్ని సమ్మతి అవసరాలను నెరవేర్చడంపై మేము దృష్టి సారించాము,” అని వాల్యూ 360 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ సీఎండీ కునాల్‌ కిషోర్‌ పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -