- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలోని కోరుట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో బస్సులోని 70 మంది ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. హజీపూర్ మండలం గుడిపేట వద్దకు చేరుకోగానే బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ వెంటనే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో 70 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఆర్టీసీ అధికారులు ప్రయాణికుల కోసం మరో బస్సును ఏర్పాటు చేశారు.
- Advertisement -



