Friday, November 21, 2025
E-PAPER
Homeఆదిలాబాద్రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు…

రైతుల కోసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు…

- Advertisement -

– ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
నవతెలంగాణ -ముధోల్

 రైతులు పండించిన ధాన్యంకు, గిట్టుబాటు ధర కల్పించుటకు కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని ముధోల్  ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ముధోల్ మండలంలోని తరోడ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సన్న రకం ధాన్యం కు ప్రభుత్వం నుంచి వచ్చే బోనస్ డబ్బులు సకాలంలో వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను దశల వారీగా పరిష్కారం చేస్తానాని పేర్కొన్నారు. 28 ప్యాకేజీ పనులు ముందుకు సాగే విధంగా కృషి చేస్తానని  ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ విషయం ను ఇప్పటికే రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. సీఎం నుండి హామీ లభించిన వెంటనే 28 ప్యాకేజీ పనులు ముందుకు సాగుతాయని ఎమ్మెల్యే ఆశ భావం వ్యక్తం చేశారు. ఇది పూర్తి అయితే 50వేల ఎకరాల కు సాగు నీరు అందుతుందన్నారు.తాను ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ 28 ప్యాకేజీ పనులు పూర్తయినంతవరకు నిరంతరం  కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావ్ పటేల్, ఎపిఎం గురు చరణ్, ఎఓ రచన, మాజీ ఎంపిటిసిలు బండారి గంగాధర్, ఆత్మ స్వరుప్,  డైరెక్టర్ ధర్మపురి సుదర్శన్, నాయకులు నర్సగౌడ్, విశ్వనాథ్ పటేల్, రవికిరణ్ గౌడ్, సతీష్ రెడ్డి, రమెష్, రాము, సాయి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -