నవతెలంగాణ-హైదరాబాద్: సీతాఫల్మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న మొగలగని రాజు డాక్టరేట్ పొందారు. ఆయనకు రసాయన శాస్త్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ పట్టాను ప్రకటించింది. రసాయన శాస్త్ర విభాగంలోని డాక్టర్ వై. హేమశ్రీ పర్యవేక్షణలో “సింథసిస్ అండ్ బయోలాజికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ నోవెల్ హెటెరోసైక్లిక్ రింగ్ పెండెంట్/అన్యులేటెడ్ స్పైరోక్రోమనోన్ డెరివేటివ్స్” శీర్షికతో చేపట్టిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ ప్రదానం చేయబడింది.
దీర్ఘకాలంగా ఐదేళ్ల పాటు సమగ్ర పరిశోధన కృషిని కొనసాగించిన తన శ్రమ ఫలితంగా ఈ గౌరవం లభించడం పట్ల డాక్టర్ రాజు సంతోషం వ్యక్తం చేశారు. రసాయన శాస్త్ర విభాగంలో డాక్టరేట్ లభించిన నేపథ్యంలో కళాశాల ప్రిన్సిపాల్, సహ అధ్యాపకులు, పరిశోధక విద్యార్థి మిత్రులు, కుటుంబ సభ్యులు ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.



