నవతెలంగాణ – హైదరాబాద్: స్కూల్ పిల్లలను పాఠాలు చెప్పేందుకు వెళ్లిన టీచర్ భవనం పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటంతో ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలోని రాజానగరం జడ్పీ పాఠశాలలో చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న కొత్త భవనం పైకప్పు పెచ్చులు అకస్మాత్తుగా ఊడిపడటంతో, అక్కడ పనిచేస్తున్న ఇంగ్లీష్ టీచర్ జ్యోత్స్నా భాయ్ మృతి చెందారు. దీంతో సాధారణంగా సాగాల్సిన పాఠశాల కార్యకలాపాలు ఒక్కసారిగా భయానకంగా మారి, ఈ అమాయక ఉపాధ్యాయురాలి మరణం విద్యార్థులు, సిబ్బంది, గ్రామస్తుల్ని తీవ్ర షాక్‌కు గురిచేసింది. కాకినాడ జిల్లా తునికి చెందిన జ్యోత్స్నా భాయ్ మృతి పట్ల రాష్ట్ర హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పని చేసే స్థలమే ప్రాణాంతకంగా మారడం మానవ తప్పిదాలపై ప్రశ్నలను లేవనెత్తుతుండగా, పాఠశాల నిర్మాణంలో జరిగిన నిర్లక్ష్యంపై విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. యువ ఉపాధ్యాయురాలి అకాల మరణం విద్యా రంగానికే కాదు, సమాజానికి పెద్ద నష్టం గా మిగిలింది.
పాఠశాల భవనం పైకప్పు పెచ్చులు పడి టీచర్ మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



