భూ నిర్వాసితుల హెచ్చరిక
కడ్తాల్ మండలంలో ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజే
నవతెలంగాణ – కడ్తాల్
కడ్తాల్ మండల పరిధిలోని మర్రిపల్లి, ఎక్వయిపల్లి గ్రామాల ప్రజలు తమ పంట పొలాలు దెబ్బతినేలా గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు మార్గాన్ని ఖరారు చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూముల మీదుగా రోడ్డు మార్గం వెళ్తోందంటూ గ్రామస్తులు తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. ఈ నేపథ్యంలో కడ్తాల్ మండల కేంద్రంలోనే బాధితులు కలిసి స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసి, ప్రాజెక్టు సర్వే పనులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా గ్రామ రైతులు మాట్లాడుతూ.. “అభివృద్ధి పేరుతో ప్రజల్ని రోడ్డు పాలు చేసే నిర్ణయాలు మేం అంగీకరించము. ముందుగా ప్రజలతో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాన్ని ఖరారు చేయాలి. అవసరమైతే ఆందోళనలకు దిగుతాం” అని హెచ్చరించారు. భూ నిర్వాసితులు అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు నష్టం లేకుండా ప్రాజెక్టును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏఏంసి వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,శ్రీపాతి బాల్ రెడ్డి, రవి కాంత్ గౌడ్, వెంకట్, రెడ్డి జోగు వీరయ్య, సుమన్, శంకరయ్య, శ్రీరాములు, శేఖర్, కర్ణాకర్, అన్నేపు జంగయ్య, వెంకటేష్, నారయ్య, ఎండి చోటే, పరమేష్, రాములుతో పాటు దాదాపు 30 మంది రైతులు పాల్గొన్నారు.



