రోజురోజుకీ పడిపోతున్న జూనియర్ కాలేజ్, ఐటీఐ కాలేజ్ అడ్మిషన్స్
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు బొడ్డు స్మరణ, కుమ్మరి రాజ్ కుమార్
నవతెలంగాణ – కాటారం
కాటారం మండల కేంద్రంలో బాలుర ఎస్ ఎం ఎస్ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని, జూనియర్ కాలేజీ, ఐటిఐ కాలేజీ, ప్రయివేటు కళాశాల విద్యార్థులకు మేలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి బొడ్డు స్మరణ కుమ్మరి రాజకుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కొన్ని సంవత్సరాలుగా ఉన్నప్పటికీ చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం లేకపోవడం వల్ల అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే హాస్టల్స్ ఏర్పాటు చేయాలి. మండలంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంవత్సరానికి సంవత్సరం చూసినట్లయితే అడ్మిషన్స్ హాస్టల్స్ లేవు, అనే పేరుతో అటు ఐటిఐ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థులు రావడం లేదు. ఈ సమస్య ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఐటిఐ కళాశాల మూసి వేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని అని వారు అన్నారు.
ఈ సమస్యలన్ని దృష్టిలో ఉంచుకొని పరిష్కరించాలని ఈ ప్రాంతం ఎమ్మెల్యే సొంత మండలం అయినటువంటి శ్రీధర్ బాబు గారు రాష్ట్ర ఐటీ మంత్రిగా ఉన్నారు. కానీ ఎటువంటి ప్రయోజనం ఈ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులకు జరగడం లేదు. ఈ సమస్యలన్నింటిని పట్టించుకోవాలని పరిష్కరించాలని పలుమార్లు ఉన్నతాధికారులను కలిసిన ఏలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ సమస్యలను పరిష్కరించాలని కాటారంకు వివిధ పనుల నిమిత్తం వచ్చిన రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబును పలుమార్లు వినతిపత్రం అందించి కలవడం జరిగిందన్నారు. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదని వారు తెలిపారు. అందుచేత తక్షణమే సమస్యల నుండి పరిష్కరించకుంటే భవిష్యత్తులో విద్యార్థులు అందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కార్యక్రమాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ నాయకులు అఖిల్, రాజు, సందేశ్ తదితరులు పాల్గొన్నారు.



