నవతెలంగాణ – తాంసి
చెకుముకి సైన్స్ సంబరాలు 2025లో భాగంగా శుక్రవారం బింపూర్ మండల స్థాయి పరీక్షను భీంపూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి రాధాకృష్ణ రెడ్డి హాజరయ్యారు. ఈ క్రమంలో పిల్లలకు పరీక్ష పత్రాలను అందించారు. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. పోటీలు మనలోని సృజనాత్మకతను వెలికి తీస్తాయని విజ్ఞాన తృష్ణను, నైపుణ్యాన్ని, పోటీ తత్వాన్ని పెంచుతాయని అన్నారు. భవిష్యత్తులో శాస్త్ర సాంకేతిక రంగం వైపుగా అడుగులు వేయాలని సూచించారు. అనంతరం మండల స్థాయి విజేతలకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కాంచన, జేవీవీ మండల బాధ్యులు శ్రీకాంత్, సత్యనారాయణతో పాటు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
భీంపూర్ లో జేవీవీ చెకుముకి సైన్స్ సంబరాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



