నవతెలంగాణ హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ రాష్ట్రంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. 32 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఏడీజీ పర్సనల్‌గా చౌహాన్, సీఐడీ డీఐజీగా పరిమిళా నూతన్, మహేశ్వరం డీసీపీగా నారాయణ రెడ్డి, తెలంగాణ నార్కొటిక్ ఎస్పీగా పద్మ, నాగర్ కర్నూలు ఎస్పీగా సంగ్రామ్ సింగ్ పాటిల్, సౌత్ జోన్ డీసీపీగా కిరణ్ కారే, మహబూబాబాద్ ఎస్పీగా శబరీష్, అసిఫాబాద్ ఎస్పీగా నిఖితాపంత్, వికారాబాద్ ఎస్పీగా స్నేహా మిశ్రా, హైదరాబాద్ టాస్క్ఫోర్స్ ఎస్పీగా వైభవ్ గైక్వాడ్, ములుగు ఎస్పీగా సుధీర్, భూపాలపల్లి ఎస్పీగా సంకేత్, వనపర్తి ఎస్పీగా సునీత, మల్కాజిగిరి డీసీపీగా శ్రీధర్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 32 మంది ఐపీఎస్‌ల బదిలీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



