నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని చేపూర్ గ్రామానికి చెందిన చిందుల కళాకారుడు చిందుల ఈశ్వర్ కుమారుడు రాజు అకాల మరణం చెందారు. వారిది నిరుపేద కుటుంబం, వృత్తి వీధి నాటకాలు ఆడటం.. వీధి నాటకాలు లభించక వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఇతని తల్లిదండ్రులు వయసు పైబడి వీధి నాటకాలు లభించక ఇంటి వద్దనే ఉంటున్నారు. ఈ విషయం గ్రామా వాట్సాప్ గ్రూపులలో చూసి చేపూర్ గ్రామానికి చెందిన ప్రజలు, నాయకులు, ఉద్యోగులు, యువకులు, గ్రామ ఎన్ఆర్ఐలు లు, వ్యాపారస్తులు వారికి తోచిన ఆర్థిక సహాయం ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు పంపించారు. మొత్తం రూ.51 వేలను గ్రామానికి చెందిన అంబేద్కర్ సంఘ సభ్యులు, మాజీ సొసైటీ డెరైక్టర్ సారంగి శాంతి కుమార్, మీనుగు రాజేశ్వర్, చేపూర్ వీడీసీ కోశాధికారి కొండ్ర రంజిత్ కుమార్, అంబేద్కర్ యూత్ సంఘం అధ్యక్షుడు మంగళారం కార్తీక్, మాజీ అంబేద్కర్ యూత్ అధ్యక్షులు సారంగీ రవి కిరణ్, స్వర్గస్తులైన చిందుల రాజు తండ్రి ఈశ్వర్ కు అందజేసినారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ ఉపాధ్యక్షులు, బి, సుధీర్ మంగళారం హరీష్, సారంగి అకిల్, కొనింటి అనిల్, చిందుల సురేష్ బాలేశ్వర్, రాము సత్య తదితరులు పాల్గొన్నారు.
నిరుపేద కళకారుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



