నవతెలంగాణ – ఆర్మూర్
పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ ఇట్టేడి నర్సారెడ్డి గురువారం మృతి చెందారు. శుక్రవారం ఆయన స్వగృహం నుండి అంత్యక్రియలు నిర్వహించినారు. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పాడే మోసినారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇదిలావుండగా తన భర్త చనిపోతూ కూడా నలుగురికి సహాయ పడాలని ఉద్దేశంతో నర్సారెడ్డి అవయవాలను కొంతమంది భాధిత పేషన్ట్లకు ఇవ్వటానికి అంగీకరించిన ఆయన సతీమణి ఇట్టేడి సునీత విశాల హృదయానికి తన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు.



