Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాల్య వివాహాలపై అంగన్వాడీలకు అవగాహన..

బాల్య వివాహాలపై అంగన్వాడీలకు అవగాహన..

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
బాల్య వివాహాల పై అనుముల ప్రాజెక్టు సూపర్ వైజర్ గౌసియా బేగం శుక్రవారం మండలం లోని కుంకుడు చెట్టు తండా అంగన్వాడీ కేంద్రం లోఅంగన్వాడీ టీచర్లు, గ్రామస్తులకు, తల్లులకు బేటీ బచవో, బేటీ పాడవో పై అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా సూపర్ వైజర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలలోనే లబ్ధిదారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాల్యవివాహాలు, అక్రమ దత్తత,మహిళలపై హింస, లింగ వివక్షపై గ్రామం లోని అంగన్వాడీ టీచర్లు,గ్రామస్తులు అప్రమత్తంగాఉండాలని తెలిపారు. 

భేటీ బచావో, బేటీ పఢావో, బాల్యవివాహాలు నియంత్రణ, తల్లి బిడ్డల సంరక్షణ పై అంగన్వాడీ టీచర్లు గ్రామస్తులకు అవగాహన కల్పించాలన్నారు. ఆడపిల్ల రక్షణ, ఆడపిల్లలను చదివించడం, లింగ పక్షపాతానికి వ్యతిరేకంగా ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని తెలిపారు. బాలికల సంక్షేమ సేవల సామర్థ్యాన్ని మెరుగు పరిచే విధంగా లక్ష్యాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లుసుదిరెడ్డి వరమ్మ,కొప్పుల లక్ష్మి,రమావత్ శారద,రమావత్ ప్రమీల,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఉమ,అమ్మ ఆదర్శ పాఠశాలకమిటీ సభ్యులు,గ్రామస్తులు,తల్లులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -