టీడబ్ల్యూజెఎఫ్ సెక్రెటరీ కొలుపుల వివేక్ ..
నవతెలంగాణ – ఆలేరు
రాష్ట్రవ్యాప్తంగా అనేకమంది జర్నలిస్టులు పేదరికంలో మగ్గుతున్నారని, వారిని వెంటనే ఆదుకోవాలని టీడబ్ల్యూ జేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొలుపుల వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజెఎఫ్) ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జర్నలిస్టు సమస్యలు పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇండ్లు, ఇండ్ల స్థలాలు, హెల్త్ కార్డులు, పెన్షన్ ను ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆలేరు భువనగిరి పట్టణ కేంద్రాలలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు.
హద్దులు హద్దులు నాటి జర్నలిస్టులకు అందజేయాలని కోరారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ కు స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగాయని, వారికి రక్షణగా జిల్లా స్థాయిలో పోలీసు, న్యాయశాఖ, రెవెన్యూ శాఖ, సమాచార శాఖ జిఏడి శాఖల ఆధ్వర్యంలో హైపర్ కమిటీ ఏర్పాటు చేసి, ఎలక్షన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆ సంఘం అధ్యక్షులు వీరబోయిన నర్సింహులు, కార్యదర్శి జలంధర్, ఉప అధ్యక్షులు మొరిగాడి మహేష్, దాసి శంకర్ జర్నలిస్టులు ఎలగల కుమారస్వామి, సాగర్, జహంగీర్, వైద్యుల తిరుపతి, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.



