మండల విద్యాధికారి సరస్వతి
నవతెలంగాణ – మిడ్జిల్
చిన్నప్పటినుండే ప్రతి విద్యార్థి సైన్స్ పట్ల అవగాహన కలిగి ఉండాలని మండల విద్యాధికారి సరస్వతి అన్నారు. మండల కేంద్రంలోని జిల్లా ఉన్నత పాఠశాల ఆవరణలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాలలో నేటికీ మూఢనమ్మకాలు పాటిస్తున్నారని, విద్యార్థులు మూఢనమ్మకాల పైన ప్రజలకు అవగాహన కలిగించాలని సూచించారు. సైన్స్ ద్వారానే దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో నిర్వహించి, మండల స్థాయిలో ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు సైన్స్ టెస్ట్ నిర్వహించినట్టు తెలిపారు. మండల స్థాయిలో టాలెంట్ సాధించిన విద్యార్థులకు జిల్లా స్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. బోయిన్పల్లి జిల్లా ఉన్నత పాఠశాల, మిడ్జిల్ ప్రభుత్వ పాఠశాల, సెంట్ మేరీ మిడ్జిల్ హైస్కూల్ విద్యార్థులను ఎంపిక చేసినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ నర్సింలు, మండల అధ్యక్షులు వెంకటయ్య, సైన్స్ టీచర్లు శ్రీనివాసులు, భాను ప్రకాష్ , ప్రనేష్ రావు, ధనలక్ష్మి, శివకుమార్ ,ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
సైన్స్ పట్ల ప్రతి విద్యార్థి అవగాహన కలిగి ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



