Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కూరగాయలు సక్రమంగా సరఫరా చేయకుంటే చర్యలు..

కూరగాయలు సక్రమంగా సరఫరా చేయకుంటే చర్యలు..

- Advertisement -

అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు

మహముత్తరం కేజీబీవీ హాస్టల్‌కు కూరగాయలు సక్రమంగా సరఫరా చేయడం లేదని తగు చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. శుక్రవారం మహాముత్తారం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్శన సందర్భంగా విద్యాలయంలోని వసతి సదుపాయాలు, విద్యార్థినులకు అందిస్తున్న భోజనం, మెనూ  నిర్వహణ, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు, హాజరు రిజిస్టర్, వంటశాల పరిశుభ్రత వంటి అంశాలను ఆయన పరిశీలించారు. ఆహార మెనూ  అమలు చేయకపోవడం లేదని ప్రిన్సిపాల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థినుల ఆరోగ్యం, పోషణ దృష్ట్యా ప్రతి రోజూ మెనూ ప్రకారం నాణ్యతమైన భోజనం అందించాలని తెలిపారు. ప్రిన్సిపాల్ పర్యవేక్షణ చేస్తూ  ఇన్‌చార్జ్‌లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

విద్యాలయంలో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు సక్రమంగా ఉండేలా నిరంతరం పర్యవేక్షణ చేయాలని,నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కూరగాయలు సక్రమంగా సరఫరా చేయడం లేదని విద్యాశాఖ అధికారి విచారణ నిర్వహించి నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల అధికారి కిరణ్ కుమార్, సహకార అధికారి వాలియా నాయక్,  తహసీల్దార్ శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ ఆర్ఐ సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -