నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
కొత్తపల్లి నుండి ఆత్మకూరు మండలం జూరాల హై లెవెల్ బ్రిడ్జ్ మంజూరు చేసినందుకు కొత్తపల్లి వాసులు ఎమ్మెల్యేకి ధన్యవాదాలు తెలిపారు. రెండో పంటకు నీళ్లు విడుదల చేయాలని ఎమ్మెల్యేకి వినతిపత్రం అందజేశారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోని కొత్తపల్లి, రేకులపల్లి, గుంటుపల్లి గ్రామాలలోని గ్రామస్తులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని మర్యాదపూర్ కలిసి జూరాల హై లెవెల్ బ్రిడ్జ్ మంజూరు కావడంతో ఎమ్మెల్యే గారి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు.
అదేవిధంగా గద్వాల మండలం రైతులు రెండో పంటకు కూడా సరిపడా నీళ్లను త్వరగా విడుదల చేయాలని ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి, నాయకులు భాస్కర్ రెడ్డి హనుమంత్ రెడ్డి, మున్నెయప్ప స్వామి, శ్రీరామ్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



