డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు ఎస్పీ , ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ఇంచార్జ్ అధికారుల పరిపాలనలో ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నాయి. వెంటనే రెగ్యులర్ అధికారులను నియమించాలి అని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ డిమాండ్ చేశారు. రెగ్యులర్ అధికారులు లేకపోవడంతో ప్రజలకు సరియైన న్యాయం జరగక ఇబ్బందులు పడుతున్నారు. ఇన్చార్జ్ అధికారుల పాలన మూలంగా వారి రెగ్యులర్ శాఖకు న్యాయం చేయలేక ఇక్కడ ఇన్చార్జి శాఖకు న్యాయం చేయలేక అధికారులు సతమతమవుతూ సరియైన పద్ధతులలో పాలనను అందించలేకపోతున్నారు అని వారు అన్నారు.
బీసీ వెల్ఫేర్ అధికారి జూన్ మాసంలో రిటైర్డ్ అయినారు. ఎస్సీ వెల్ఫేర్ అధికారి ఫిబ్రవరి మాసంలో బదిలీ అయినారు. 2022 అక్టోబర్ మాసం నుండి ఎస్టీ వెల్ఫేర్ అధికారి లేడు. ఇలా జిల్లా వ్యాప్తంగా సంక్షేమ శాఖలకు రెగ్యులర్ అధికారులు లేకపోవడం మూలంగా ప్రజా పరిపాలన ఇబ్బందులు జరుగుతున్న పరిస్థితి, పనులు కూడా ముందుకు సాగక ఎక్కడికక్కడ స్తంభించిపోయిన పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ప్రధాన సంక్షేమ శాఖలకు ఇప్పటివరకు అధికారులు నియమించకపోవడం మూలంగా జిల్లాలో ఇన్చార్జిల పాలన నడుస్తున్నది దీనివలన ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిశీలించి జిల్లా సంక్షేమ శాఖలకు రెగ్యులర్ అధికారులు నియమించాలని వారు డిమాండ్ చేశారు. వీరితోపాటు జిల్లా సహాయ కార్యదర్శి ఎండి సలీం, ఎస్ఎఫ్ఐ మాజీ జిల్లా కార్యదర్శి వనం రాజు, డివైఎఫ్ఐ జిల్లా కమిటి సభ్యులు షేక్ రియాజ్, ఎండి సాజిద్ లు పాల్గొన్నారు.



