తనకు సహకరిస్తున్న ఎంఇఓ, డిఈఓ లను సస్పెండ్ చేయాలి
ప్రజాసంఘాలు డిమాండ్
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని ఎడ్లపల్లి మోడల్ స్కూల్ డెవలప్మెంట్ కొరకు పీఎంఎంసి నిధులు రూ.21 లక్షల మంజూరయ్యాయి. అయితే పాఠశాలలో ఏలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా తప్పుడు లెక్కలు చూపించి స్థానిక రాజకీయ నాయకుల అండతో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ రూ.21 లక్షల ప్రభుత్వ నిధులు స్వాహా చేయశాడని ప్రజాసంఘాల నాయకులు ఐత బాపు పీక కిరణ్, అక్కల బాపు యాదవ్ ఆరోపించారు. శుక్రవారం మండలంలోని కొయ్యుర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు పేర్కొన్నారు. మోడల్ స్కూల్లో నైట్ వాచ్ మెన్ డ్యూటీ చేయకుండా వాచ్మెన్ పేరు మీద వచ్చిన జీతాన్ని సైతం ప్రన్సిపాల్ తీసుకొని సొంతానికి వాడుకొంటున్నాడని అన్నారు.
అలాగే మోడల్ స్కూల్ లో రెగ్యులర్ గా ఇద్దరు స్కావేంజర్లను నియమించాల్సి ఉండగా ఒక వర్కర్ నియమించి, ఇంకో వర్కర్ రికార్డులో చూపించి ఒక వర్కర్ జీతం ప్రిన్సిపాల్ అమాంతం మింగుతున్నాడనీ తెలిపారు. వెంటనే సంభంధిత ఉన్నత అధికారులు ఎడ్లపల్లి మోడల్ స్కూల్ లో జరిగే అవినీతి అక్రమాలపై దృష్టి సారించి పాఠశాల నిధుల గోల్ మాల్ కు పాల్పడిన ప్రన్సిపాల్, అతనికి సహకరించిన, రాజకీయ నాయకులు, ఎంఈఓ, డిఈఓ లపై కఠిన చర్య తీసుకోవాలనీ ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
అంతేగాక మల్లారం కెజిబివి పాఠశాలలో పిల్లలకు భోజనం సక్రమంగా పెట్టడం లేదని, అలాగే ఉపాధ్యాయులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. మెనూ ప్రకారం భోజనం పిల్లలకు అందించక నానా ఇబంది పెడుతున్నారనీ, వెంటనే ఉన్నత అధికారులు మల్లారం కెజిబివి పాఠశాలను సందర్శించి అందులో పనిచేసే ప్రన్సిపాల్, ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకొని విద్యార్థులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేనీపక్షంలో విద్యార్థి సంఘాలు,ప్రజాసంఘాలు ఏకమై భారీఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, మంథెన మహేష్,అక్కపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.



