Friday, November 21, 2025
E-PAPER
Homeఖమ్మంపాఠ్యాంశాలపై ఆసక్తి రేపేలా బోధన

పాఠ్యాంశాలపై ఆసక్తి రేపేలా బోధన

- Advertisement -

– పారఖ్  సర్వే పై ఉపాధ్యాయులకు అవగాహన
– ఎంఈఓ ప్రసాదరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్సీఈఆర్టీ ఆద్వర్యంలో మూడో తరగతి విద్యార్థులకు నిర్వహించనున్న పారఖ్  సర్వే ఉన్నందున విద్యార్ధులకు పాఠ్యాంశాల పై ఆసక్తి కలిగేలా బోధించాలని ఎంఈఓ ప్రసాదరావు ఉపాధ్యాయులకు సూచించారు. పారఖ్ సర్వేపై శుక్రవారం స్థానిక జిల్లాపరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు.

విద్యార్థులను అత్యున్నత స్థానంలో ఉంచేందుకు ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆయన  కోరారు.మూడో తరగతి విద్యార్థుల కు తెలుగు,ఆంగ్లం, గణితం లలో సర్వే ఉంటుందని మూడు సబ్జెక్టులను విద్యార్థులతో అభ్యాసం చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ల హెచ్ఎం లు హరిత,సాహీనా బేగం,కొండలరావు,వీరేశ్వరరావు లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -