- Advertisement -
నవతెలంగాణ – తిమ్మాజిపేట
ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం నాసిరకం ఇసుక పోశారని లబ్ధిదారిరాలు అవేదన వ్యక్తం చేశారు. తిమ్మాజిపేట మండల కేంద్రానికి చెందిన బాలమ్మకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా, ఇసుక కోసం కోందరిని అశ్రయించగా, వారు రూ.22 వేలు తీసుకుని బాగాలేని ఇసుక పోశారని ఆమె ఆవేదన చేశారు. ఆ సమయంలో తాను ఉంటే అలాంటి ఇసుకను పోసుకునే దాన్ని కాదన్నారు. మొత్తం దుబ్బ, మట్టి ఉందన్నారు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు షేక్ ముభారక్ ఈ వ్యవహారం విడియే తీసి బయట పెట్టారు. అమే కు న్యాయం చేయాలని, నాన్యమైన ఇసుకను మళ్లీ అందించాలని డిమాండ్ వారు చేశారు.
- Advertisement -



