Friday, November 21, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల వసతి గృహంలో విద్యార్థులకు అందని దుప్పట్లు

తాడిచెర్ల వసతి గృహంలో విద్యార్థులకు అందని దుప్పట్లు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరగడంతో వసతిగృహాల్లో విద్యార్థులు గజగజ వణికిపోతున్నారు. మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో 6 నుంచి 10 తరగతి వరకు చదువుతున్న మొత్తం 45 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి సరిపడా బెడ్ షిట్లు, కార్పెట్లు లేక విద్యార్థులు ఇళ్ల నుంచి తెచ్చుకున్న దుప్పట్లే కప్పుకొంటున్నారు. కొందరు విద్యార్థులు పాత దుప్పట్లు కప్పుకోవడంతో రాత్రివేళ చాలామంది విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు.

పాఠశాల ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా రగ్గులు, దుప్పట్లు ఇవ్వకపోవడంతో చలికి ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడుగా ఉదయం పూట గ్లిజర్లు పని చేయకపోవడంతో చన్నీటి స్నానం చేస్తూ గజగజ వణుకుతూ దగ్గు, సడిదితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. చలికి తట్టుకోలేక విద్యార్థులు చలి మంటలు కాగుతున్నారు. వసతి గృహంలో చెడిపోయిన మరుగుదొడ్లను తొలగించకుండా ఉంచారు. వీటి ద్వారా రాత్రివేళల్లో విషసర్పాలు సంచరించే అవకాశం ఉంది. గృహం మెయిన్ గేటు చెడిపోయి అస్తవ్యస్తంగా ఉందని మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు కోరుతున్నారు.

నాలుగైదు రోజుల్లో బెడ్ షీట్లు వస్తాయి: వెంకటేశ్వర్లు..వార్డెన్
వసతిగృహానికి సంబంధించి బెడ్ షీట్ల టెండర్లు పూర్తయ్యాయి.నాలుగైదు రోజుల్లో విద్యార్థులకు సరిపడా బెడ్ షీట్లు అందిస్తాం. త్వరలోనే గ్లిజర్స్ మరమ్మతులు చేయిస్తాం హాస్టల్ విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -