– హెచ్.యం. పరుచూరి హరిత
నవతెలంగాణ – అశ్వారావుపేట
పిల్లలు ఉన్నత స్థాయి చదువుల్లో రాణించాలంటే తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని,విద్య పట్ల వారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. శుక్రవారం జిల్లాపరిషత్ ఉన్న పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్ధుల తల్లిదండ్రులు తో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పిల్లలు ఎలా చదువుతున్నారు,వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి,అనే విషయాలను తల్లిదండ్రులు తెలుసుకోవాలంటే తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సమావేశాలకు వస్తే పిల్లల సామర్థ్యం తెలుస్తుందని అన్నారు.ప్రతీ రోజు సమయానికి పాఠశాలకు వచ్చేలా చూడాలని ప్రత్యేక తరగతులను సద్వినియోగం చేసుకోవాలని,జంక్ ఫుడ్ లకు దూరంగా ఉంచాలని,ఇంటివద్ద కూడా ఆరోగ్య ప్రదమైన ఆహారాన్ని అందించాలని సెల్ఫోన్ లకు, టి.వి.లకు దూరంగా ఉంచాలని అన్నారు.
తరగతి ఉపాధ్యాయులు “వేక్ అప్ కాల్” చేసినపుడు సరైన సమాధానాన్ని ఇవ్వాలని తల్లిదండ్రులు పూర్తిగా సహకరిస్తే ఈ ఏడు కూడా 10 వ తరగతిలో ఉత్తమ ఫలితాలు రాబడతామని అన్నారు.తల్లిదండ్రులు వారి పిల్లల ప్రవర్తన గురించి వివరించారు.సమావేశంలో విద్యార్ధుల యస్ఎ 1 మార్కులను తల్లిదండ్రుల ముందు ప్రదర్శించారు.ఈ సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయులు,సి.ఆర్.పి ప్రభాకరాచార్యులు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.



