ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి చిక్కుడు రాములు
ఘనంగా ముదిరాజ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – పాలకుర్తి
రాజ్యాధికారంమే లక్ష్యంగా ముదిరాజులు ఉద్యమించాలని ముదిరాజ్ మహాసభ నియోజకవర్గ ఇన్చార్జి చిక్కుడు రాములు ముదిరాజులకు పిలుపునిచ్చారు. ముదిరాజ్ మహాసభ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బండ ప్రకాష్ ఆదేశాల మేరకు శుక్రవారం ముదిరాజ్ మహాసభ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని పాలకుర్తిలో ముదిరాజ్ మహాసభ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ హక్కుల సాధన కోసం ముదిరాజులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ముదిరాజులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేసి ముదిరాజుల అభ్యున్నతి కోసం పాటుపడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షులు మాచర్ల ఎల్లయ్య, నాయకులు నీరటి చంద్రయ్య, మామిండ్ల శోభన్, బాలబోయిన నరేష్, తరాల చంద్రబాబు, ఈర్ల రాజు, మామిండ్ల సోమన్న, మోకాటి కుమార్ లతోపాటు ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాజ్యాధికారమే లక్ష్యంగా ముదిరాజులు ఉద్యమించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



