- Advertisement -
ఎవరికెవరు పరాయి?
మనిషిలో మనిషి కలవడా?
మనిషి సృష్టి రూపాయి
మార్కెట్ మయమై
ప్రపంచ పయనం
కార్పొరేట్ల పాలనలో
మనిషికి మిగిలేది
యుద్ధం-విధ్వంసం
అదేమిటో
అమెరికాలో ఆకలికేకలు
మానవత్వానికి ఇక చెల్లు
కులం-మతం- ప్రాంతం-దేశం
శ్రమశక్తికి హద్దులు అడ్డుగోడలు
‘పరాయి’పదం
ఇంకెంతకాలం?
వికసించని
విచక్షణా జ్ఞానం
మనిషిని మనిషిగా
చూడని పాలననవసరం
ఈరోజు కాకపోతే రేపు
విశ్వనరుడే విజేత
అందరినీ బతికించేది
అవనిని కాపాడేది
ఆధునిక స్వామ్యం
అదే ప్రజాస్వామ్యం
-కె.శాంతారావు
- Advertisement -



