ఆర్‌యుపీపీ-టీఎస్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని ఆర్‌యుపీపీ-టీఎస్ కోరింది. ఈ మేరకు శుక్రవారం రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఎం.ఎన్.విజయకుమార్, రాష్ట్ర అధ్యక్షులు శానిమోని నర్సిములు పాఠశాల విద్య సంచాలకలు నవీన్ నికోలస్‌కు వినతిపత్రం సమర్పించారు. టెట్ మినహాయింపు కుదరని పక్షంలో వేసవి సెలవుల్లో ప్రత్యేక టెట్ నిర్వహించాలని సూచించారు. ఆ మేరకు సబ్జెక్టు బోధించే ఉపాధ్యాయుల వారీగా సిలబస్ను మార్చి టెట్ పరీక్ష నిర్వహించాలని కోరారు. టెట్‌పై న్యాయ సలహాలు కోరామనీ, ఆ సలహాల మేరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముందు కెళ్తామని నవీన్ నికోలస్ చెప్పినట్టు నాయకులు వెల్లడించారు.
వాస్తవ పరిస్థితులు వివరించాలి : డీటీఎఫ్
టెట్ తప్పనిసరి అని సుప్రీంకోర్టు తీర్పుపై వేసిన రివ్యూ పిటీషన్‌లో వాస్తవ పరిస్థితులు వివరించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.సోమయ్య, టి.లింగారెడ్డి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాహక్కు చట్టంలో అవసరమైన సవరణలు చేయాలని కోరారు. టెట్ పరీక్ష సిలబస్ కూడా అశాస్త్రీయంగా ఉందని,బోధించే సబ్జెక్టుకు సంబంధం లేని విషయాలపై పరీక్ష పెట్టడం సరికాదని పేర్కొన్నారు.
టెట్‌పై ఎంపీలకు వినతిపత్రాలు : తపస్
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పార్లమెంటులో చర్చించాలని తపస్ కోరింది. ఈ మేరకు శుక్రవారం తపస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హన్మంత్ రావు నవాత్ సురేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఎంపీలకు వినతిపత్రాలు సమర్పించాలని ఏబీఆర్‌ఎస్‌ఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నెల 22 నుంచి 28 వరకు రాష్ట్రంలోని ఎంపీలకు వినిత పత్రాలను అందజేయనున్నట్టు వారు వెల్లడించారు.
ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



