వీరిలో పది జిల్లాల ఎస్పీలు, నలుగురు డీసీపీలు
రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. ఇందులో ఒక అదనపు డీజీ, మరో డీఐజీ స్థాయి అధికారితో పాటు 30 మంది ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు.
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 32 మంది ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. ఇందులో ఒక అదనపు డీజీ, మరో డీఐజీ స్థాయి అధికారితో పాటు 30 మంది ఎస్పీ స్థాయి అధికారులు ఉన్నారు. ఇందులో పది మంది జిల్లాల ఎస్పీలు, నలుగురు నగర డీసీపీలు ఉన్నారు. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో జిల్లాల ఎస్పీల బదిలీలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బదిలీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.




